ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
✍️ దివిటీ మీడియా – బూర్గంపాడు
ఆర్ధిక ఇబ్బందులతో బాధపడుతున్న ఓ వ్యక్తి ఆత్మహత్యకు (బలవన్మరణానికి) పాల్పడిన సంఘటన మండల కేంద్రమైన బూర్గంపాడులో జరిగింది. బూర్గంపాడు ఎస్సై మేడా ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం… బూర్గంపాడు గ్రామానికి చెందిన సాధనాల నాగేశ్వరరావు(39) మాంసం దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతను మంగళవారం సాయంత్రం బూర్గంపాడు గ్రామశివారులో ఉరేసుకుని విగతజీవిగా కనిపించాడు. గమనించిన స్థానికులు ఇచ్చిన సమాచారంతో అతని కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకున్నారు. ఆ సంఘటనాస్థలంలో మృతుని వద్దనుంచి అశ్వారావుపేట మండలం ఆసుపాకకు చెందిన వ్యక్తి ప్రోద్బలంతో బెట్టింగులకు బానిసై ఆర్ధికంగా నష్టపోవడంతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని రాసిన సూసైడ్ నోట్ లభించినట్లు మృతుని భార్య మాధవి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

