Divitimedia
Bhadradri KothagudemEducationHyderabadLife StyleNational NewsSportsTechnologyTelanganaWomenYouth

జాతీయస్థాయి షూటింగ్ పోటీలకు జిల్లా క్రీడాకారులు

జాతీయస్థాయి షూటింగ్ పోటీలకు జిల్లా క్రీడాకారులు

✍️ దివిటీ మీడియా – కొత్తగూడెం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా షూటింగ్ క్రీడలో మరో ఘనత సాధించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీలో బాలికల విభాగంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన గరిడేపల్లి భావన, బాలుర విభాగంలో కొమరోజు శ్రీరామ్ అద్భుత ప్రతిభతో జాతీయస్థాయి షూటింగ్ పోటీలకు ఎంపికయ్యారు. కేరళ రాష్ట్రం త్రివేండ్రంలో ఆగస్టు 31నుంచి సెప్టెంబర్ 9వరకు నిర్వహించిన సౌత్ జోన్ రైఫిల్ అండ్ పిస్టల్ షూటింగ్ ఛాంపియన్ షిప్ -2026 అర్హత పోటీల్లో వీరు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. జాతీయస్థాయిలో పోటీలకు అర్హత సాధించిన ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రీడాకారుల పట్ల జిల్లా షూటింగ్ క్రీడావర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. క్రమశిక్షణతో, నిరంతర సాధనతో కోచ్ ఎండీ అబ్దుల్ నబి మార్గదర్శకత్వంలో ఈ ఇద్దరు క్రీడాకారులు ఈ ఘనతను సాధించినట్లు పేర్కొన్నారు. జాతీయస్థాయి పోటీలు ఈ ఏడాది డిసెంబర్ నెలలో డెహ్రాడూన్ షూటింగ్ రేంజిలో నిర్వహించనున్నట్లు తెలిపారు. జాతీయస్థాయి పోటీలలో కూడా భావన, శ్రీరామ్ ప్రతిభ చాటుకుని జిల్లాకు మరింతగా పేరు ప్రతిష్టలు తీసుకురావాలని జిల్లా క్రీడాభిమానులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైఫిల్ షూటింగ్ అసోసియేషన్ ప్రతినిధులు, కోచ్ లు, తల్లిదండ్రులు, తోటిక్రీడాకారులు భావన, శ్రీరామ్ లను అభినందించారు. జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారి ఎం.పరంధామరెడ్డి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులు భావన, శ్రీరామ్ తోపాటు కోచ్ అబ్దుల్ నబిని ప్రత్యేకంగా అభినందించారు. వీరిద్దరూ జాతీయస్థాయిలో కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు, రాష్ట్రానికి మంచిపేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

బలప్రదర్శనతో సత్తా చాటిన జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత దంపతులు

Divitimedia

మంత్రుల పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల

Divitimedia

నీటిపారుదల శాఖలో నిర్ణయాలు పారదర్శకంగా ఉండాల్సిందే

Divitimedia

Leave a Comment