Divitimedia
Bhadradri KothagudemEducationHealthLife StyleSpot NewsTelanganaWELFAREYouth

డిగ్రీ కాలేజీలో మొక్కలు నాటిన సిబ్బంది, విద్యార్థులు

డిగ్రీ కాలేజీలో మొక్కలు నాటిన సిబ్బంది, విద్యార్థులు

✍️ దివిటీ మీడియా (కొత్తగూడెం)

“ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం” సందర్భంగా మంగళవారం భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో సిబ్బంది, విద్యార్థులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జాన్ మిల్టన్ మాట్లాడుతూ, పర్యావరణాన్ని, ప్రాణవాయువును అందించే మొక్కలు నాటి, సంరక్షణ బాధ్యత తీసుకుంటే మనకు ఎటువంటి రోగాలు రుగ్మతలు దరిచేరవన్నారు. కాలేజీ ఎన్ఎస్ఎస్ విభాగం, ఇకో క్లబ్, యాంటీ డ్రగ్ కమిటీ ఆధ్వర్యంలో కాలేజీ ఆవరణలో పలు రకాల మొక్కలు నాటారు. పుట్టినరోజు, పెళ్లిరోజు వేడుకల్లో తప్పనిసరిగా పనికి వచ్చే మొక్కను నాటి, సంరక్షణ బాధ్యత తీసుకోవాలన్నారు. మై భారత్ పోర్టల్ జిల్లా కన్వీనర్ రాంబాబు విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ, మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, మొక్కలు నాటడం వల్ల పర్యావరణంలో కలిగే ప్రయోజనాల గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ హవీలా, ఎన్ఎస్ఎస్ పీఓలు డాక్టర్. కిరణ్ కుమార్, బి.సుధాకర్ రావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

రాష్ట్ర ప్రభుత్వానికి రూ.88.55కోట్ల డివిడెండ్ చెల్లించిన సింగరేణి

Divitimedia

పారిశ్రామికవేత్తలకు పూర్తి సహాయ సహకారాలు : సీఎం రేవంత్ రెడ్డి

Divitimedia

ఇంజినీరింగ్ పనులన్నీ ఏప్రిల్ 10లోగా పూర్తి చేయకపోతే చర్యలు

Divitimedia

Leave a Comment