విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్, ఎమ్మెల్యే

✍️ దివిటీ మీడియా (మార్కాపురం)
మార్కాపురం జిల్లా బెస్తవారిపేట మండల కేంద్రంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం జిల్లా కలెక్టర్ ఎం.విజయసునీత, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమూల అశోక్ రెడ్డి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా వారు ఆ విద్యార్థులను ఆప్యాయంగా పలకరించిన జిల్లాకలెక్టర్, ఎమ్మెల్యే, వారికందుతున్న సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. కొమరోలు మండలకేంద్రంలో జరిగిన నియోజకవర్గ స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో జిల్లాకలెక్టర్ ఎం.విజయసునీత, జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు, ఎమ్మెల్యే ముత్తుమూల అశోక్ రెడ్డి, ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, ఇతర అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు(ఫిర్యాదులు) స్వీకరించారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

