రోడ్డుప్రమాదంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ మృతి
✍️ దివిటీ మీడియా (కొత్తగూడెం)
భద్రాచలం రామాలయంలో పనిచేస్తున్న టెంపుల్ ఇన్స్పెక్టర్ రామిరెడ్డి శుక్రవారం జరిగిన రోడ్డుప్రమాదంలో మృతిచెందారు. సన్నిహితుల కథనం ప్రకారం… భద్రాచలం నుంచి కూనవరం రోడ్డుకు వెళ్తుండగా ద్విచక్ర వాహనాన్ని ఒక సీఆర్పిఎఫ్ వాహనం ఢీకొట్టడంతో ఆయన తీవ్ర గాయాలపాలైనట్లు స్థానిక ప్రజలు చెప్తున్నారు. ఆయనను చికిత్స కోసం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు, బంధువులు చెప్తున్నారు. ఈ సంఘటనపై పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.
Save or share this story as a newspaper-style Epaper Clip:

