వాతావరణ పరిస్థితులకనుగుణంగా పంటలసాగు చేపట్టాలి
జిల్లా వ్యవసాయాధికారి బాబురావు సూచనలు
✍️ దివిటీ మీడియా (కొత్తగూడెం)
వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు పంటల ప్రణాళిక రూపొందించుకొని వరి సాగుకు బదులుగా పప్పుధాన్యాలు, కూరగాయల పంటలు, ఆయిల్‌పామ్ వంటి ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారి బాబురావు సూచించారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం గుంపెన గ్రామంలో నిర్వహించిన రైతు అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని రైతులతో పంటల వైవిధ్యీకరణ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పంటల ఎంపిక చేపట్టాలని, వ్యవసాయ శాఖ సూచనలను పాటిస్తూ శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేయాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి (ఎంఏఓ), వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ), వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

