Divitimedia
HyderabadKhammamLife StyleSpot NewsTelanganaYouth

దుబాయి ఉద్యోగాలకై జూలై 21న ఇంటర్వ్యూలు

దుబాయి ఉద్యోగాలకై జూలై 21న ఇంటర్వ్యూలు

ఖమ్మం జిల్లా ఉపాధి అధికారి మాధవి

✍️ దివిటీ మీడియా (ఖమ్మం)

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దుబాయిలోని ఒక ప్రముఖ కంపెనీలో అత్యవసర విదేశీ ఉద్యోగాల భర్తీ కోసం హైదరాబాద్ టామ్ కామ్ ఆధ్వర్యంలో ఈనెల 21న ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు, ఖమ్మం జిల్లా ఉపాధి అధికారి ఎన్.మాధవి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాలని కోరారు. క్లీనర్స్, టైల్ మేసన్, ఆల్రౌండ్ మేసన్, బ్లాక్/ప్లాస్టర్ మేసన్, స్టీల్ ఫిక్సర్, షట్టరింగ్ కార్పెంటర్, ప్లంబర్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రీషియన్, ఫినిషింగ్ కార్పెంటర్, ఎం.ఐ.జి.వెల్డర్, జనరల్ హెల్పర్ ట్రేడ్లలో 500మంది అభ్యర్థుల అవసరమున్నట్లు వెల్లడించారు. ఎంపికైన అభ్యర్థులకు పని గంటలుగా రోజుకు 9గంటలు ఓవర్ టైమ్ తో ఉంటాయని, నైపుణ్యాల గ్రేడ్ ప్రకారం ఓవర్ టైమ్ తో పాటు జీతం చెల్లిస్తారని వివరించారు. ఈ ఉద్యోగాల భర్తీ ఆఫ్ లైన్ ఇంటర్వ్యూ ప్రక్రియ ద్వారా జరుగుతుందని తెలిపారు. హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంక్ సమీపంలో ఉన్న కొత్త టామ్ కామ్ కార్యాలయంలో ఈ నెల 21న నిర్వహించే ఇంటర్వ్యూలకు ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు రెజ్యూమ్, పాస్పోర్టు, విద్యార్హత, అనుభవం వంటి ధృవపత్రాలతో నేరుగా హాజరు కావాలని ఖమ్మం జిల్లా ఉపాధి అధికారి మాధవి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

బూర్గంపాడు మహిళా సమాఖ్యకు వరికోత యంత్రం మంజూరు

Divitimedia

విద్యార్థి మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి : పి.డి.ఎస్.యు

Divitimedia

సికిల్ సెల్ అనీమియా శాశ్వతంగా నివారించాలి

Divitimedia

Leave a Comment