Divitimedia
Bhadradri KothagudemHealthKhammamLife StyleSpot NewsTelanganaWELFAREWomen

మున్సిపాలిటీ కార్మికులకు కుక్కర్లు వితరణ

మున్సిపాలిటీ కార్మికులకు కుక్కర్లు వితరణ

సంక్రాంతి కానుకగా అందజేసిన గుర్రాల శ్రీనివాసరెడ్డి


✍️ దివిటీ మీడియా

మకర సంక్రాతి పండుగ సందర్బంగా మధిర పట్టణంలోని మున్సిపాలిటీ కార్మికులకు స్థానిక రెడ్డిగార్డెన్స్ అధిపతి గుర్రాల శ్రీనివాసరెడ్డి ఆదివారం రైస్ కుక్కర్లు పంచి పెట్టారు. 150 కుక్కర్లను సొంతఖర్చుతో కొనుగోలు చేసి ఆయన మున్సిపాలిటీ సఫాయ్ కార్మికులకు అందజేశారు. ఈ సందర్భంగా సంక్రాతి పండుగ ప్రతిఇంట ఆనందంగా సాగాలని కోరుకుంటూ, అందరికీ సంక్రాతి శుభాకాంక్షలు తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో మధిర మున్సిపాలిటీ కమిషనర్ సంపత్ కుమార్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిరియాల వెంకటరమణ గుప్తా, మాజీ కౌన్సిలర్ కోన ధనికుమార్, అంజిరెడ్డి, రంగా శ్రీనివాసరావు, తన్నీరు రామకృష్ణ, కరివేద సుధాకర్, సిద్ధంశెట్టి సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ప్రజలకోసం సమన్వయంతో పనిచేయాలి

Divitimedia

ఎస్.హెచ్.జి. సభ్యులకు ఇన్సూరెన్స్ నమోదు

Divitimedia

పాఠశాలల్లో అల్పాహార పథకం ప్రారంభించిన కలెక్టర్, ఎమ్మెల్యే

Divitimedia

Leave a Comment