Divitimedia
HyderabadKarimnagarKhammamMuluguPoliticsTelangana

రాష్ట్రంలో 32 పంచాయతీల్లో ఎన్నికలు లేవు

పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

రాష్ట్రంలో 32 పంచాయతీల్లో ఎన్నికలు లేవు

✍️ దివిటీ – హైదరాబాద్(నవంబరు 25)

తెలంగాణలో గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం సాయంత్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. ముఖ్య ఎన్నికల అధికారి రాణి కుముదిని విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్రంలో 12,728 గ్రామ పంచాయతీల్లో (32 గ్రామ పంచాయతీలు మినహాయించి మిగిలిన గ్రామ పంచాయతీల్లో) మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 11వ తేదీన తొలి విడత, 14వ తేదీన రెండో విడత, 17వ తేదీన మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి పేర్కొన్నారు. మొదటి విడత నామినేషన్లు నవంబర్ 27వ తేదీ నుంచి, రెండవ విడత నామినేషన్లు నవంబర్ 30వ తేదీ నుంచి, మూడవ విడత నామినేషన్లు డిసెంబర్ 3వ తేదీ నుంచి స్వీకరించనున్నారు. ఎన్నికలు జరిగే తేదీల్లో మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్, మధ్యాహ్నం 2గంటల తర్వాత ఓట్ల కౌంటింగ్ నిర్వహించనున్నట్లుగా ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. న్యాయస్థానం ఆదేశాల వల్ల ములుగు జిల్లా మంగపేట మండలంలో 25, కరీంనగర్ జిల్లాలోని వి.సైదాపూర్ మండలంలో 2, ఖమ్మం జిల్లాలోని ఏన్కూరు మండలంలో 4, పెనుబల్లి మండలంలో 1 గ్రామ పంచాయతీల్లో ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించడం లేదని ప్రకటించారు. జిల్లాల్లో ఏఏ విడతలో ఏఏ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయనే వివరాలను జిల్లాల ఎన్నికల అధికారులు ప్రకటించనున్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

సీఎం సభాస్థలం పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

Divitimedia

“అంగన్వాడీలో మురిగిపోయిన కోడిగుడ్లు”పై డీడబ్ల్యుఓ

Divitimedia

రాష్ట్రంలో మరో నాలుగు కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం

Divitimedia

Leave a Comment