Divitimedia
Bhadradri KothagudemCrime NewsInternational NewsLife StyleNational NewsPoliticsSpot NewsTelangana

పెహల్గాంలో ఉగ్రదాడిని ఖండించిన మస్జిదే దావత్

పెహల్గాంలో ఉగ్రదాడిని ఖండించిన మస్జిదే దావత్

✍️ సారపాక – దివిటీ (ఏప్రిల్ 25)

పెహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో శుక్రవారం మస్జిదే దావత్ ఆధ్వ‌ర్యంలో ర్యాలీ నిర్వహించారు.
జుమ్మా నమాజ్ అనంతరం మసీదు నుంచి సారపాక సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మసీదు కమిటీ సభ్యుడు షేక్ అబ్దుల్ సలీం మాట్లాడుతూ, కాశ్మీర్‌లో ఉగ్రవాదుల అమానుష దాడి పిరికిపందల చర్య అన్నారు. ఇది మానవత్వంపై జరిగిన దాడిగా భారత ముస్లిం సమాజం భావిస్తుందన్నారు. ఆ దుర్ఘటనలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నామన్నారు. ఈ టెర్రరిస్టులు దాడులతో తమ ఉక్కు సంకల్పాన్ని చెదరగొట్టలేరన్నారు. దారుణ ఘటనలో మరణించిన కుటుంబాలను తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

పారిశ్రామికవేత్తలకు పూర్తి సహాయ సహకారాలు : సీఎం రేవంత్ రెడ్డి

Divitimedia

దేశంలో అత్యుత్తమ పోలీసుస్టేషనుగా రాజేంద్రనగర్ స్టేషన్

Divitimedia

‘సమస్యలతో వచ్చే బాధితులకు భరోసా కల్పించాలి’

Divitimedia

Leave a Comment