Divitimedia
BusinessCrime NewsDELHIHyderabadLife StyleNational NewsPoliticsSpot NewsTelanganaYouth

సుప్రీంకోర్టు ఆదేశాలతో మారుతున్న పరిణామాలు

సుప్రీంకోర్టు ఆదేశాలతో మారుతున్న పరిణామాలు

కంచ గచ్చిబౌలి భూములపై ప్రభుత్వ కమిటీ నియామకం

✍️ హైదరాబాదు – దివిటీ (ఏప్రిల్ 3)

హైదరాబాదు కంచగచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చి, తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు పనులు చేయొద్దని ఆదేశించిన నేపథ్యంలో పలు పరిణామాలు సంభవిస్తున్నాయి. అక్కడ జరుగుతున్న అన్ని పనులు తక్షణమే ఆపేయాలని, ఇది చాలా సీరియస్‌ విషయమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో కంచ గచ్చిబౌలి భూముల విషయంలో తదుపరి కార్యాచరణపై ప్రభుత్వం మంత్రుల బృందంతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గురువారం ఓ ప్రకటనలో ఈ విషయం వెల్లడించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. కంచ గచ్చిబౌలి భూ సమస్యల పరిష్కారం దిశగా కమిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కార్యనిర్వాహక కమిటీ, జేఏసీ, పౌర సమాజ సమూహాలు, విద్యార్థుల ప్రతినిధి బృందం, తదితర సంబంధిత స్టేక్ హస్వాగతిందరితో సంప్రదింపులు జరుపుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్ఢి పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో హెచ్.సి.యు విద్యార్థులు చేసుకుంటుండగా, పలువురు నేతలు స్పందించారు. సుప్రీం తీర్పు విద్యార్థుల సమైక్య విజయమని బీజేపీ నాయకుడు రఘునందన్‌ రావు వ్యాఖ్యానించారు. ఈ భూముల విషయంలో విద్యార్థుల పట్ల పోలీసులు అమానవీయంగా ప్రవర్తించిన విషయం రాహుల్‌ దృష్టికి రాలేదా? అంటూ రఘునందన్‌రావు ప్రశ్నించారు. భవిష్యత్తులో విద్యార్థుల భూములు ప్రైవేట్ వ్యక్తులకెవరికైనా ఇవ్వకుండా అడ్డుకుంటామని ఆయన పేర్కొన్నారు. కాగా, కంచ గచ్చిబౌలి భూముల అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన స్టే ప్రభుత్వానికి చెంపపెట్టని బీఆర్ఎస్ నేత హరీష్‌రావు వ్యాఖ్యానించారు.
అధికారం ఉందని ఇష్టమొచ్చినట్టు చేస్తే చట్టం ఊరుకోదని, ఇది విద్యార్థుల, సామాజికవేత్తల విజయమని ఆయన పేర్కొన్నారు. సుప్రీం కోర్టు స్టే ఆర్డర్‌ను స్వాగతించిన బీఆర్ఎస్ నేత కేటీఆర్‌,
హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ విద్యార్థుల విజయమని, విద్యార్థుల పోరాటం వల్లే ఇది సాధ్యమైందన్నారు. కంచ గచ్చిబౌలి భూముల పరిరక్షణకు మద్దతు ఇచ్చిన అందరికీ ధన్యవాదాలంటూ కేటీఆర్‌ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం కూడా దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు కోర్టు ఆదేశాలు పాటిస్తామని ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ,పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటించారు. సర్వోన్నత న్యాయస్థానం కోరిన సమాచారాన్ని గడువులోపు పంపిస్తామన్నారు. సుప్రీం కోర్టుపై రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి విశ్వాసముందని, న్యాయం గెలుస్తుందని తెలిపారు. విద్యార్థులపై కఠినంగా వ్యవహరించవద్దని అదనపు డీజీ (ఇంటెలిజెన్స్), సైబరాబాద్ కమిషనర్లను ఆదేశించినట్లు పేర్కొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

పసిబిడ్డలకు ప్రాణసంకటంగా ‘కుళ్లిన గుడ్లు’…

Divitimedia

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు

Divitimedia

ముగ్గురు మావోయిస్టులు, ఒక సానుభూతిపరుడి అరెస్టు

Divitimedia

Leave a Comment