Divitimedia
Bhadradri KothagudemEducationHealthHyderabadLife StyleSpot NewsTelanganaYouth

ఉప్పుసాకలో ఎన్.సి.సి విద్యార్థుల స్వచ్ఛతాహీ సేవ

ఉప్పుసాకలో ఎన్.సి.సి విద్యార్థుల స్వచ్ఛతాహీ సేవ

✍️ బూర్గంపాడు – దివిటీ (అక్టోబరు 2)

మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఉప్పుసాక గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఎన్.సి.సి విద్యార్థులు బుధవారం ‘స్వచ్ఛతాహీ సేవ’ కార్యక్రమం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు బి.భీమా, ఎన్.సి.సి ఆఫీసర్ బి.తారాచంద్ ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. పాఠశాలలోని గదులతోపాటు ఆవరణ శుభ్రం చేశారు. తమ పాఠశాల ఆవరణలో ఉన్న సరస్వతీదేవి, దివంగత డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహాలను కడిగి శుభ్రం చేశారు. స్వచ్ఛత ఆవశ్యకతను అందరూ గుర్తించాలని చాటి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బి.వెంకటేశ్వర్లు, బి.ప్రసాద్, కె.రమేశ్, టి.విజయ, జి.రాములు, బి.రాములు, జి.భద్రు, టి.లాలా, పీడీ ఈశ్వర్, పీఈటీ శశికళ, సీఆర్టీలు హతీరాం, వెంకట్, రాజు, కిషన్, జనార్థన్, తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఉమ్మడి ఖమ్మం జిల్లా వాలీబాల్, యోగా ఎంపికలు

Divitimedia

తప్పులు చెరుపుకోవాలని… తప్పించుకు తిరుగుతున్నాడు…

Divitimedia

గిరిజన మహిళా డిగ్రీకళాశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్

Divitimedia

Leave a Comment