Divitimedia
Bhadradri KothagudemLife StyleNational NewsSpot NewsTelanganaWomen

సంపూర్ణత అభియాన్ పనులు పరిశీలించిన డాక్టర్ యోగితారాణా

సంపూర్ణత అభియాన్ పనులు పరిశీలించిన డాక్టర్ యోగితారాణా

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (జులై 11)

సంపూర్ణత అభియాన్ కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చేపట్టిన పనులు, కార్యక్రమాలను గురువారం వ్యసాయ శాఖ జాయింట్ సెక్రటరీ, కేంద్ర ప్రభారీ అధికారి డాక్టర్ యోగితారాణా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తో కలిసి పర్యటించారు. పర్యటనలో భాగంగా సిగన్నభూపాలెం చెక్ డ్యామ్ పరిశీలించారు. పనికి మంజూరైన నిధులు, జరిగిన పనుల వివరాలను ఇంజనీరింగ్ అధికారులనడిగి తెలుసుకున్నారు. స్థానిక రైతులతో ఆమె మాట్లాడుతూ, ఆ చెక్ డ్యామ్ పనుల నాణ్యత, మంజూరైన నిధులు, ఖర్చుచేసిన నిధులకు సంబంధించిన వివరాలు తెలుసో? లేదో? అని ఆరా తీశారు. ప్రజల డబ్బులతో నిర్మిస్తున్న చెక్ డ్యామ్ అని, అందుకే అధికారులనడిగి తెలుసుకుని ప్రజలు కూడా పర్యవేక్షించాలని అన్నారు. చెక్ డ్యామ్ కు ఇరువైపులా మొక్కలు నాటాలన్నారు. తాము చెక్ డ్యామ్ అవతల వైపునకు వెళ్ళడానికి, పంటను తరలించడానికి సరైన రహదారి లేనందున రహదారి మంజూరు చేయాలని రైతులు కోరగా, పరిశీలించాలని ఆమె జిల్లా కలెక్టరును కోరారు. శుక్రవారం ఎంపీడీఓను పంపించి ప్రణాళిక తయారు చేయిస్తామని కలెక్టర్ చెప్పారు.

వేపలగడ్డ అంగన్వాడీ కేంద్రాన్ని కూడా సందర్శించిన యోగితారాణా, అక్కడ మంచినీటి వసతి పరిశీలించి, గర్భిణులు, పిల్లలతో మాట్లాడారు. పోషకాహారం, టీకాల గురించి ఆరా తీశారు. గర్భిణులతో మాట్లాడి, సిజేరియన్, సాధారణ డెలివరీల గురించి వివరాలు తెలుసుకున్నారు. సిజేరియన్ కాకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో నార్మల్ డెలివరీ చేయించుకోవాలని సూచించారు. గర్భిణులకు సీమంతం వేడుకలను ఘనంగా నిర్వహించారు. పోషకాహారం వివరాలపై చిన్నారుల తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రంలో మొక్క నాటారు. సర్వారంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శించి, ఏఎన్ఎం, ఆశా వర్కర్లనుంచి వారందించే సేవలు గురించి ఆరాతీశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రిజిస్టర్లను తనిఖీ చేశారు. హైరిస్క్ రిజిస్టరులో నమోదు సరిగా లేదని గమనించి ఖచ్చితమైన వివరాలను నమోదు చేయవలసిందిగా ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన మందుల పట్టిక పరిశీలించి అందులో మందులు అందుబాటులో ఉన్నాయో? లేదో?నని తనిఖీ చేశారు. అందుబాటులో ఉన్న మందుల పట్టికను తెలుగులో అందరికీ అర్థమయ్యే విధంగా బయట బోర్డు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమాల్లో పలువురు జిల్లా, స్థానిక అధికారులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

రక్షణశాఖ భూముల కోసం కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వ వినతి

Divitimedia

పెండింగ్ గ్రాంట్ కోసం కేంద్రమంత్రిని కలిసిన సీఎం

Divitimedia

ఇందిరమ్మ మోడల్ హౌస్ కు శంకుస్థాపన చేసిన పాయం

Divitimedia

Leave a Comment