Divitimedia
Bhadradri KothagudemHealthHyderabadLife StylePoliticsSpot NewsTelangana

పాయం రాములమ్మ, పద్మశ్రీ రామచంద్రయ్యలకు మంత్రి తుమ్మల నివాళులు

పాయం రాములమ్మ, పద్మశ్రీ రామచంద్రయ్యలకు మంత్రి తుమ్మల నివాళులు

✍️ మణుగూరు – దివిటీ (జూన్ 26)

మణుగూరు మండలం సమ్మతి సింగారం గ్రామంలో ఇటీవల మరణించిన ప్రముఖ డోలు వాయిద్యకారుడు పద్మశ్రీ సకిని రామచంద్రయ్య, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాతృమూర్తి రాములమ్మలకు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి నాగేశ్వరరావు బుధవారం ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు మణుగూరు వచ్చిన మంత్రి తుమ్మల, వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి, శ్రద్ధాంజలి ఘటించారు. రామచంద్రయ్య కుటుంబ సభ్యులను, మాతృవియోగం సంభవించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును, ఆయన కుటుంబ సభ్యులను తుమ్మల పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రముఖులు సాధు రమేష్ రెడ్డి, తుపాకుల ఎల్లగొండస్వామి, ఎండీ రసూల్, తుళ్లూరు బ్రహ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

మంత్రి తుమ్మలను కలిసిన కలెక్టర్, ఎస్పీ

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావును భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్పీ బి. రోహిత్ రాజు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్తగూడెంలోని ఇల్లందు గెస్ట్ హౌస్ లో మంత్రిని కలిసిన వారు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

రక్షణశాఖ భూముల కోసం కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వ వినతి

Divitimedia

లొంగిపోయిన మావోయిస్టు బెటాలియన్ దళసభ్యుడు

Divitimedia

రెండు కార్లలో 21 కేజీల గంజాయిని స్వాధీనం

Divitimedia

Leave a Comment