Divitimedia
Bhadradri KothagudemEducationHyderabadLife StyleSpot NewsTechnologyTelanganaWomenYouth

ఐటీసీ-బీఎంఎస్ ఆధ్వర్యంలో ఎగ్జామ్ కిట్స్ పంపిణీ

ఐటీసీ-బీఎంఎస్ ఆధ్వర్యంలో ఎగ్జామ్ కిట్స్ పంపిణీ

గురుకులంలో 725 మంది బాలికలకు బహూకరణ

✍ దివిటీ మీడియా – భద్రాచలం, ఫిబ్రవరి 27

సారపాకలోని ఐటీసీ పీఎస్ పీడీ అనుబంధ సంస్థ
భద్రాచలం మహిళా సమితి (బి.ఎం.ఎస్)  ఆధ్వర్యంలో భద్రాచలంలోని గిరిజన గురుకులం విద్యాసంస్థలో ఇంటర్, టెన్త్ పరీక్షలకు హాజరయ్యే బాలికలకు మంగళవారం ఎగ్జామ్ కిట్స్ పంపిణీ చేశారు. ప్యాడ్, పెన్స్, స్కెచ్ పెన్స్, రబ్బర్, స్కేల్, పౌచ్ తదితరాలతో కూడిన ఈ కిట్స్ వల్ల ఆ విద్యా సంస్థలో చదివే దాదాపు 725 మంది బాలికలకు సౌలభ్యం కలుగుతుంది. ఈ సందర్బంగా బిఎంఎస్ వైస్ ప్రెసిడెంట్ టి.సునీతమొహంతి, ప్రతినిధులు  రేష్మశర్మ, ప్రతిభమనోజ్ మాట్లాడుతూ, భద్రాచలం గిరిజన గురుకులంలో బాలికలు అన్నీ రంగాలలో రాణించడం తమను ఎంతగానో ఆకట్టుకుందని ప్రశంసించారు. అందుకే ఈ గిరిజన బాలికలను ప్రోత్సహించేందుకు ఎగ్జామ్ కిట్స్ అందిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని పిల్లలు సద్వినియోగం చేసుకుని ఇంటర్, టెన్త్ పరీక్షల్లో చక్కని ప్రతిభ  సాదించాలని కోరారు. ప్రిన్సిపాల్ ఎం. దేవదాస్ మాట్లాడుతూ, తమ విద్యార్థినులను ప్రోత్సహిస్తూ ఎంతగానో ఉపయోగపడే పరీక్షలకు సంబంధించిన కిట్లను ఐటీసీ బిఎంఎస్ నిర్వాహకులు అందించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన గురుకుల కళాశాల, పాఠశాల అధ్యాపకులు, టీచర్స్, నాన్ టీచింగ్ స్టాఫ్, బిఎంఎస్ సభ్యులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

విలువిద్య పోటీల్లో జాతీయస్థాయికి ఎంపికైన మమత

Divitimedia

సారపాక, కృష్ణసాగర్ గ్రామాల్లో కాంగ్రెస్ విస్తృతప్రచారం

Divitimedia

ప్రజలందరూ నిర్భయంగా ఓటుహక్కు సద్వినియోగం చేసుకోవాలి

Divitimedia

Leave a Comment