Divitimedia
Bhadradri KothagudemCrime NewsJudicialLife StyleSpot NewsTelangana

జాతీయ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోండి

జాతీయ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోండి

జిల్లా న్యాయ సేవాధికారసంస్థ కార్యదర్శి ఎం.రాజేందర్

✍️దివిటీ (కొత్తగూడెం) ఆగస్టు 28

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టులో వచ్చే నెల(సెప్టెంబర్) 13వ తేదీన జరుగనున్న జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.రాజేందర్ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ లోక్ అదాలత్ లో తమ మీద కానీ, తమకు తెలిసిన వాళ్లెవరిపైన కానీ, తమ బంధువులమీద కానీ ఏవైనా కేసులున్నట్లైతే వాటిని రాజీ(కాంప్రమైజ్ ) చేసుకోవచ్చన్నారు. యాక్సిడెంట్ కేసులు, సివిల్ కేసులు, చీటింగ్ కేసులు, చిట్ ఫండ్ కేసులు, భూతగాదాలకు సంబంధించిన కేసులు, వివాహ బంధానికి సంబంధించిన కేసులు, చిన్నచిన్న దొంగతనం కేసులు, ట్రాఫిక్ చలాన్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, కుటుంబతగాదాలు, బ్యాంకులావాదేవీల కేసులు, టెలిఫోన్ బకాయిల కేసులు, కొట్టుకున్న కేసులు, సైబర్ క్రైమ్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు ఈ లోకదాలత్ లో రాజీ చేసుకుని, కేసును పూర్తిగా క్లోజ్ చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. కక్షిదారులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

నేటి ప్రజావాణి రద్దు : కలెక్టర్ జి.వి.పాటిల్

Divitimedia

ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా పతాకావిష్కరణలు

Divitimedia

అభివృద్ధి, సంక్షేమ పథకాలపై కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్

Divitimedia

Leave a Comment