Divitimedia
Bhadradri KothagudemEducationHealthHyderabadLife StyleSpot NewsTelanganaWomenYouth

విద్యార్థులకు ఘనస్వాగతం పలికిన జిల్లా కలెక్టర్

విద్యార్థులకు ఘనస్వాగతం పలికిన జిల్లా కలెక్టర్

జిల్లాలో ఘనంగా పాఠశాలల పునఃప్రారంభం

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ మీడియా (జూన్ 12)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల బుధవారం పలు పాఠశాలల్లో విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలికారు. పాల్వంచ మండలంలోని ప్రశాంత్ నగర్ ఎంపీపీఎస్, లక్ష్మీదేవిపల్లి మండలం కొత్తూరు ఎంపీపీ పాఠశాల, గొల్లగూడెం జిపిఎస్ పాఠశాల, చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలోని ఎంపీపీఎస్ పాఠశాలలో జరుగుతున్న బడిబాట కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా కలెక్టర్ విద్యార్థినీ, విద్యార్థులకు టెక్ట్స్ బుక్స్, యూనిఫామ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్12 పాఠశాలల పునఃప్రారంభం ముఖ్యమైనదని తెలిపారు. బడిబాట కార్యక్రమం ఈసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో, ఎన్నికల సంఘం కల్పించిన ప్రత్యేక వెసులుబాటుతో మూడు నెలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పాఠశాలలన్నిటికీ ప్రత్యేక మరమ్మత్తులు చేపట్టామనననారు. గతానికి భిన్నంగా ఈసారి సీఎం చొరవతో విద్యాసంవత్సరం మొదటిరోజే విద్యార్థులకు యూనిఫామ్స్, టెక్ట్స్ బుక్స్ పంపిణీ జరిగాయని తెలిపారు. జిల్లా పరిధిలో 63వేల మంది విద్యార్థులకు కేవలం 20 రోజుల్లోనే యూనిఫామ్స్ తయారు చేశామని తెలిపారు. జిల్లా పరిధిలోని 858 పాఠశాలలకు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పనులు చేపట్టామని. మరమ్మత్తులకు రూ.26కోట్లు మంజూరు చేశామని తెలిపారు. పాఠశాల గదులలో రెండు ఫ్యాన్లు రెండు లైట్లు, తాగునీరు, మరుగుదొడ్లు విద్యార్థులకు ఏర్పాటు చేశామని తెలిపారు. కేవలం నెలన్నర వ్యవధిలో 70శాతం పనులు పూర్తిచేశామని, రానున్న 15రోజుల్లో జిల్లాలో అన్ని పాఠశాలల్లో పనులు పూర్తవుతాయని తెలిపారు. ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ సౌకర్యాలు వినియోగించుకోవాలని కోరారు. బడిఈడు పిల్లలంతా పాఠశాలల్లోనే ఉండాలని, మరే పనులకు వెళ్లరాదని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెం మండలం గొల్లగూడెం జిపిఎస్ పాఠశాలలో బడిబాట కార్యక్రమం గోడపత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, డి.ఆర్.డి.ఓ విద్యాచందన, కొత్తగూడెం ఆర్డీఓ మధు, జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వరచారి, మున్సిపల్ కమిషనర్ శేషాంజనస్వామి, తాసిల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఎంపీపీలు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

మాతా శిశు ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలి

Divitimedia

బాధ్యతలు చేపట్టిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా

Diviti Media News

సింగరేణి గెస్ట్ హౌస్ నిర్వహణపై మంత్రి పొంగులేటి ఆగ్రహం

Divitimedia

Leave a Comment